పుట్టి పెరిగిన సొంత ఊరు కన్న తల్లి తో సమానం. సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుని ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి చేర్చించుకుంటాము...ఎవరో వస్తారు ఊరికి ఎదో చేస్తారు అని ఎదురుచూడకుండా ప్రతి పల్లె లోని ప్రజలందరు కలిసిమెలిసి సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవాలని మా మనవి. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. జై హింద్....
Sunday, December 3, 2017
Friday, August 25, 2017
Thursday, August 24, 2017
Tuesday, August 22, 2017
Saturday, August 12, 2017
Pullaganti viswanath
నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి.
ధర్మో రక్షితి రక్షతః
అందరికి నమస్కారము.
ప్రతి ఒక్కరికి తమ జన్మస్థలం అయిన ఊరంటే ఏంతో అభిమానం,ప్రేమ,మమకారం,ఏన్నో తీపి ఙ్ఞాపకాలు ఉంటాయి.అలాగే మా ఊరంటే నాకు కూడా ఏంతో అభిమానం,గౌరవం,ప్రేమ ఉంది.మన కన్నతల్లిలాంటి ఊరికి ఏదోక మంచి పని చేసి ఋణం తీర్చుకోవాలి.అది ప్రతి ఒక్కరికి, ఆ గొప్ప సంకల్పం ఉండాలి.[ శారద ఙ్ఞాన పుత్ర, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు ] గారి ప్రవచనాలు వినడం చేత, తెలుసుకున్న వాటిని కొన్ని ఆచరణలోకి తీసుకోచ్చి, సమాజనికి ఏధైన ఉపకారం చేయడం కొరకై మా వంతు సహయం, కృషి చేయాలని నిర్ణయించుకుని, మొదటి సారిగా మా ఊరిలోనే కొన్ని మంచి పనులు చెపట్టాము.అవి అందరి కృషితో,సహయంతో,గొప్ప గొప్ప పనులు మరియు దేవాలయల అభివృద్ధి ఇలా ఎన్నో మంచి పనులు ఊరు వారందరం కలసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.అందరితో పాటు నేను అందులో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
శ్రీరామ చంద్రుడే ఆనాడు వనవాసంలో లక్ష్మణా స్వామితో జన్మభూమి గురించి కొన్ని మంచి మాటలు అన్నాడని రామయణంలో ఉంది..
{జననీ జన్మ భూమిశ్చ/ స్వర్గాదపి గరీయసి అనగా ... }
ఓ లక్ష్మణా! బంగారు మయమైన లంక నాకు ఇష్టము లేదు.ఎందుకనగా జననీ, జన్మభూమి స్వర్గ ముకన్నాగొప్పవి. అంతేకాదు యస్య నిశ్వసితం వేదాః వేదేభ్యోఖిలం జగత్ భగవంతుని ఉచ్చ్వాశ నిశ్వాసాలనుండి వేదాలు పుట్టాయి, వేదాల నుండి సమస్త విశ్వం పుట్టింది. అనగా వేదాలు విశ్వసృష్టిని చక్కగా వివరించాయి. ఇట్టి వేదభూమిలో పుట్టిన మనం ఎలా ఉండాలో,ఎలాఉండ కూడదో, మన ఆచార వ్యవహారాలూ అన్ని చక్కగా పురాణ గ్రంధాలు వివరించాయి. అంత గొప్పది మన దేశం.అని వివరంగా శ్రీరాముడు లక్ష్మణా స్వామితో చెప్పాడని రామయణం తెలియజేస్తుంది.
ప్రతి ఊరి వారందరు కలసి తమ ఊరిని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని,మన దేశ స్వర్ణ స్వరాజ్యంలో ,బంగారు పల్లెగా రూపుదిద్దుకోవాలని కొరుకుంటున్నాను.
పుల్లగంటి విశ్వనాథ్,
నిర్వాహకులు, నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి.
Wednesday, August 9, 2017
LED Street Lights
ఎన్నో సంవత్సరాలుగా వీధి లైట్స్ కు నోచుకోని ఊరు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మారని ఊరు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఊరి ప్రజలందరి సహకారంతో ఊరి అభివృద్ధి లో భాగంగా ఏర్పాటు చేసుకున్న LED street Lights.
Vemula Narasimhulu
అభివృద్ధి కమిటి ప్రధాన సలహాదారులు,వేముల నరసింహులు గారు ఊరి అభిరుద్ది కోసం తన వంతుగా ఆర్థికంగా,మాట పరంగా సహాయం చేస్తూ ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తూ మంచి మంచి సలహాలు ఇస్తూ కమిటి లోని సభ్యులందరిని ఒకే తాటి పై నడిపిస్తున్న వ్యక్తి. వేముల నరసింహులు గారికి హార్దిక శుభాకాంక్షలు.....
Tuesday, August 8, 2017
Nagavaram Vaddipalli Development Commeette
అభివృద్ధి కమిటి సమావేశం ప్రతి నెల ఏర్పాటు చేసుకుంటాము. సమావేశంలో సభ్యులందరం కలుసుకుని ఊరి అభివృద్ధి కార్యక్రమాలు గురించి చేర్చించుకుని పలు నిర్ణయాలు తీసుకుంటాము. మా ఊరి తరుపున వడ్డేరాజుల సంక్షేమ సంఘ కార్యక్రమాలకు కమిటి తరుపున సభ్యులు హాజరవుతుంటారు.
Nagavaram Vaddipalli Development Commeette
మా ఊరి ప్రజలందరం కలిసి మెలిసి త్రాగునీటి సమస్య ను నిర్ములించుకున్నాము. అభివృద్ధి కమిటి ఏర్పాటు చేసుకున్న తర్వాత తలపెట్టిన మొదటి పని విజయవంతం కావడంతో కమిటి సభ్యులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.we are all happy....
Monday, August 7, 2017
Founder's message
నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి.
నమస్కారం, నా పేరు కుంచం ఈశ్వర్ ,మా ఊరు నాగవరం వడ్డిపల్లి, చిట్వేల్ మండలం, కడప జిల్లా.మనం పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లి తో సమానం.సొంత ఊరికి ఏంతో కొంత సహాయం చేసి ఋణం తీర్చుకోవాలని నా ముఖ్య ఉద్దేశ్యం. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా ఊరి తలరాత మారలేదు, అభివృద్ధికి నోచుకోలేదు.2017 ఏప్రిల్ నెల వరకు కూడా ఇంచుమించు 150 గృహాలు,800 మంది ప్రజలు ఉన్న మా ఊరిలో త్రాగునీటి కోసం మంచి నీటి కుళాయి ఒకే ఒక్కటి మాత్రమే ఉండేది.చాలా సంవత్సరాలు గా వీధి లైట్లు లేని ఊరు,ఇవ్వే కాదు ఇంకా సమస్యలు ఉండేవి.
ఈ సమస్యలు అన్ని పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో 2017 ఫిబ్రవరి 24 వ తేది మహాశివరాత్రి నాడు నా స్నేహితుడు మొక్కట్ల శ్రీనివాసులు తో కలిసి నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటిని స్థాపించాము. అభివృద్ధి కమిటి పేరు మీద whatsapp గ్రూప్ ఏర్పాటు చేసి దేశ విదేశాలలో (కువైట్, దుబాయ్, కత్తర్) నివసిస్తున్న మా ఊరి ప్రజలందరి ఫోన్ నెంబర్లు సేకరించి వారికి ఊరి అభిరుద్ది కార్యక్రమాల గురించి వివరించాము. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి తమ సహాయ సహకారాలు అందించి ఊరి అభివృద్ధికి కృషి చేయడానికి ముందుకు వచ్చారు.
ఇప్పటి వరకు ఊరిలో చాలా అభివృద్ధి పనులు చేపట్టి విజయవంతం చేసాము. కొందరి పెద్దల సహాయం మరియు ఊరి ప్రజలందరి సహకారంతో త్రాగునీటి సమస్య నిర్ములించుకున్నాము. విదేశాల్లో(కువైట్, దుబాయ్, కత్తర్) నివసిస్తున్న ఊరి ప్రజల సహకారంతో LED street lights ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంవత్సరాలుగా అభిరుద్ది కి నోచుకోని మా ఊరి దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నాము. చాలా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకున్నాము. ఊరిలో జరిగే ప్రతి కార్యక్రమం మరిము దేవుని ఊరేగింపు, ఉత్సవాలు ఇలా అన్ని కూడా అభివృద్ధి కమిటి ద్వారా నిర్వహిస్తున్నాము. మేము చేసిన ప్రయత్నం మా ఊరి తలరాతనే మార్చేసింది. మా ఊరి పెద్దలు, యువకులు మరియు ప్రజలందరి కృషి ఉండడంతో మా ఊరు ఉన్నంత అభివృద్ధి చెందింది. మా ఊరి ప్రజలందరు కలిసి మెలిసి ఒకే కుటుంబంలా సుఖ సంతోషాలతో గడుపుతున్నారు. ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఊరి ప్రజలందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ముగింపు:దేశంలోని పల్లెల్లో నివసిస్తున్న ప్రజలందరికి నా విజ్ఞప్తి, ఎన్ని ప్రభుత్వాలు మారినా మన పల్లె తలరాత మారలేదు అభివృద్ధి జరగలేదు అని బాదపడకుండా, పల్లెల్లో నివసిస్తున్న ప్రజలందరు కలిసి మెలిసి పల్లె అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరపాలని మా మనవి. అందరూ కలిసి మెలిసి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమి లేదు. పల్లెలు అభివృద్ధి జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
భారత్ మాతకి జై, వందేమాతరం, జై హింద్.
కుంచం ఈశ్వర్,
వ్యవస్థాపకులు, నాగవరం వడ్డిపల్లి అభిరుద్ది కమిటి.
Sunday, August 6, 2017
నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి
మా ఊరి ప్రజాలందరం అభివృద్ధి కార్యక్రమాలు గురించి చేర్చించుకోవడానికి whatsapp group ఏర్పాటు చేసుకున్నాము. కమిటీ సభ్యులు తెలియచేసిన మొదటి సందేశం...
